ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం - అయిదుకు చేరిన మృతులు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 4:39 PM IST
|Updated : Dec 22, 2023, 10:47 PM IST
16:35 December 22
పెద్దారవీడు - దేవరాజుగట్టు జాతీయరహదారిపై ప్రమాదం
Road Accident : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అయిదుకి చేరింది. దేవరాజుగట్టు వంతెన పై నుంచి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటో పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరిని మార్కాపురం, ముగ్గురిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం మార్కాపురం నుంచి ఇద్దరు ఒంగోలు ఆస్పత్రికి తరలిస్తుండగా డానియల్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో నలుగురు మాబూ, అభినయ్ (10), రాయ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు కొమరోలులోని ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి వెళ్లి తిరిగి స్వగ్రామం గుంటూరు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆటో కుంట నుంచి మార్కాపురం వైపు వస్తూ ఎన్ఎస్ అగ్రికల్చర్ కళాశాల వద్ద ఐదుగురు విద్యార్దులను ఎక్కించుకొని మార్కాపురం వెళ్తుంది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు అగ్రికల్చర్ కళాశాలకు చెందిన విద్యార్థినులతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.