విఘ్నేశ్వరుడి రూపంలో తేనె తుట్టె.. - latest news of prakasham district
వినాయక చవితి పండుగ వేళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఓ ఇంట్లో గోడపై అచ్చు విఘ్నేశ్వరుడి రూపంలో తేనెతుట్టె పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పూజలు చేస్తూ.. వారు మురిసిపోతున్నారు.
వినాయక చవితి వేడుకలు వాడవాడలా ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా ఇంకొల్లు శివాలయం వీధిలో ఓ ఇంట్లో అద్భుతం అవిష్కృతమైంది. కరణం నాగేంద్రమ్మ అనే మహిళ ఇంట్లోని గోడపై కొద్దిరోజులుగా తేనె తుట్టె పెట్టింది. అది సాయంత్రానికి వినాయక రూపంలో రావటంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. విఘ్నేశ్వరుడు ముఖం, తొండంతో సహా రూపం ఏర్పడటంతో.. విషయం తెలుసుకున్న స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. తేనె తుట్టెను ఈ రూపంలో ఇంతవరకు చూడలేదని అంటున్నారు. ఇంటి యజమాని కరణం నాగేంద్రమ్మ మాత్రం వినాయకచవితి రోజున ఆ లంబోదరుడే తన ఇంటికొచ్ఛాడని దూరం నుంచే పూజలు చేస్తూ.. మురిసిపోతోంది.
ఇదీ చదవండి:మోటుపల్లిలో బయటపడ్డ 12వ శతాబ్దంనాటి వినాయక విగ్రహం