ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హాజీపురం అడ్డ రోడ్డు దగ్గర ద్విచక్రవాహనదారులపై తేనెటీగలు దాడి చేశాయి. కొండారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్, బన్ను, రాజు అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై కనిగిరి వెళ్తుండగా హాజీపురం అడ్డరోడ్డు వద్ద ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేసిన ఘటనలో ఈ ఇద్దరూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. గుర్తించిన స్థానికులు బాధితులను కనిగిరి ప్రభుత్వవైద్యశాలకు తరలించారు.
తేనెటీగల దాడి.. అపస్మారక స్థితిలో యువకులు - prakasham district latest news update
ప్రకాశం జిల్లా అడ్డరోడ్డు దగ్గర ద్విచక్రవాహనదారులపై తేనెటీగలు దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు యువకులు అపస్మారక స్థితికి చేరగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

వాహనదారులపై తేనెటీగల దాడి