ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో ఉద్రిక్తత... భారీగా పోలీసుల మోహరింపు - చీరాలలో పోలీసుల మోహరింపు

ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం కూడలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ ప్రజాసంకల్ప యాత్ర పూర్తైన సందర్భంగా వైఎస్​ విగ్రహానికి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చీరాలలో ఉద్రిక్తత...భారీగా పోలీసుల మోహరింపు
చీరాలలో ఉద్రిక్తత...భారీగా పోలీసుల మోహరింపు

By

Published : Nov 5, 2020, 11:00 PM IST

ప్రకాశం జిల్లా చీరాల గడియారస్తంభం కూడలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్లయిన సందర్భంగా శుక్రవారం కార్యక్రమాలు చేపట్టాలని వైకాపా శ్రేణులు నిర్ణయించారు. వైఎస్​ విగ్రహానికి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించగా...పోలీసులు వారిని అడ్డుకున్నారు.

నియోజకవర్గంలో పోలీస్ 30 యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని సీఐ రాజమోహన్ వారికి వివరించే ప్రయత్నం చేశారు. కాగా క్రాంతి అనే వైకాపా సోషల్ మీడియా కార్యకర్త సీఐతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. అనంతరం గడియారం సెంటర్​వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details