ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెబ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత - అయ్యప్ప మాలదారులతో కలిసి వైఎస్సార్సీపీ నేతల ఆందోళన - కనిగిరి సెబ్ కార్యాలయం

High Tension at Kanigiri SEB Office: సెబ్ కార్యాలయం వద్ద అయ్యప్ప మాలదారులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

High_ Tension_at_Kanigiri_SEB_Office
High_ Tension_at_Kanigiri_SEB_Office

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 2:05 PM IST

High Tension at Kanigiri SEB Office: ప్రకాశం జిల్లాలోని కనిగిరి సెబ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయ్యప్ప స్వామి మాలదారున్ని అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా సెబ్ సీఐ కొట్టాడంటూ కనిగిరి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయం వద్ద అయ్యప్ప మాలదారులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

జిల్లాలోని పామూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్(అయ్యప్ప మాలదారుడు) స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు తన ఇంటి వద్ద కూల్ డ్రింక్ దుకాణం ఉంది. కూల్ డ్రింక్ దుకాణం మాటున శ్రీకాంత్ అక్రమ మద్యాన్ని అమ్ముతూ ఉన్నాడనే సమాచారంతో సెబ్ సీఐ జలీల్ ఖాన్ ఒక్కసారిగా శ్రీకాంత్ కూల్ డ్రింక్ షాప్​పై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నాలుగు మద్యం బాటిళ్లు లభ్యం కాగా అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నావంటూ శ్రీకాంత్​ను అదుపులోకి తీసుకొని కనిగిరి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశాడు.

నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబుల విధ్వంసం - ఆ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి!

విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు సెబ్ కార్యాలయం వద్దకు చేరుకొని శ్రీకాంత్​ను అక్రమంగా అరెస్టు చేశారంటూ కొందరు అయ్యప్ప మాలదారులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం శ్రీకాంత్​ను కనిగిరి పోలీస్ స్టేషన్​కు తరలించగా హడావుడిగా స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ పోలీస్ స్టేషన్​కు చేరుకున్నారు. ఒక్కసారిగా అధికారులపై విరుచుకుపడుతూ వారిని దూషించడమేకాక సెబ్ సీఐపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. 'మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేదే లేదు నీకు ఎన్నిసార్లు చెప్పినా మారలేదు' అంటూ సెబ్ సీఐ జలీల్ ఖాన్​పై వెంటనే కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే కనిగిరి సీఐకు హుకుం జారీ చేశారు.

తమ కార్యకర్త అని కూడా చూడకుండా అందులోనూ అయ్యప్ప మాలలో ఉన్నాడని కూడా లెక్కచేయకుండా సెబ్ సీఐ జలీల్ ఖాన్ వైఎస్సార్సీపీ కార్యకర్తను బూతులు తిడుతూ కొట్టాడంటూ స్వయంగా వైఎస్సార్సీపీ నాయకులే నిందితుడి తరుపున ఫిర్యాదును రాసి కనిగిరి సీఐకు ఇచ్చారు. దీనిపై సెబ్ సీఐ స్పందిస్తూ తాను ఎవరినీ కొట్టలేదని నిందితుడు శ్రీకాంత్ కూల్ డ్రింక్ దుకాణం మాటున అక్రమంగా మద్యం విక్రయిస్తుంటే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అంతేకాక తన సెల్ ఫోను ఆన్ చేయమన్నానని అలా చేస్తే ఎక్కడ అక్రమ వ్యవహారాలు బయటకు వస్తుందోనని తన అనుచరులను పిలిపించి శ్రీకాంత్ ఆందోళన చేశారని సీఐ జలీల్ ఖాన్ స్థానిక ఎమ్మెల్యేకు బదులిచ్చాడు.

విజయవాడలో డ్రగ్స్ కలకలం - సింథటిక్‌ డ్రగ్‌తో సెబ్​ అధికారులకు పట్టుబడ్డ యువకుడు

ABOUT THE AUTHOR

...view details