ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరిశిక్ష పడిన 15 మంది కేసుల్లో.. అప్పీలుపై హైకోర్టులో విచారణ - ongole lorry theft case

ఒంగోలులో లారీల చోరీ, డ్రైవర్లు-క్లీనర్ల హత్య కేసు విచారణలో.. ఉరిశిక్ష పడిన 15 మంది కేసుల్లో అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వలేదని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. వారితో ఏకీభవించిన ధర్మాసనం.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ విజయవాడలో చేయాలని సూచించింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : May 5, 2022, 10:05 PM IST

ఒంగోలులో లారీల దొంగతనం,ఆరుగురు డ్రైవర్లు, క్లీనర్ల హత్యకేసులో ఉరిశిక్ష పడిన 15 మంది కేసుల్లో అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది. తాజాగా కేసులో హైకోర్టు అమికస్‌ క్యూరీ నాగముత్తు వాదనలు వినిపించారు. ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వలేదని నిందితుల తరఫు న్యాయవాదులు తెలిపారు. వారితో ఏకీభవించిన ధర్మాసనం.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ విజయవాడలో చేయాలని సూచించింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు హైబ్రిడ్‌ పద్ధతిలో విచారణ జరగనుంది. అనంతరం హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా ఈ కేసులో 15 మందికి గతంలో ఒంగోలు న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:రాజధాని తీర్పు అమలుపై.. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details