ప్రకాశం జిల్లా బల్లికురవ మండల కార్యాలయంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఎమ్.వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి. రజినీ పాల్గొన్నారు.
బాలల హక్కులపై అవగాహన కల్పించండి : జస్టిస్ టి.రజినీ - హైకోర్టు మాజీ న్యాయమూర్తి వార్తలు
ప్రకాశం జిల్లా బల్లికురవలో అంతర్జాతీయ బాలల హక్కులు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రజినీ పాల్గొన్నారు. బాలలకు వారి హక్కులపై అవగాహన కల్పించాలని ఆమె కోరారు.
judge rajani
జస్టిస్ టి. రజినీ మాట్లాడుతూ నేటి బాలలకు.. వారి హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి చిన్నారి చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో ఎదగాలని, పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. అనంతరం బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామంలో కరోనా బారిన పడి చనిపోయిన వాలంటీర్ కుటుంబానికి మండల అధికారులు నగదును అందజేశారు.
ఇదీ చదవండి :18 నెలల పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా: రామ్మోహన్ నాయుడు