ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం చెరువులో సహజసిద్ధంగా పెంచిన చేపలను మూడేళ్ల విరామంలో వేలం ద్వారా విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్... ఆదివారం నుంచి జాలర్లు చేపలు పడుతుండగా.. 30, 25, 23 కిలోల బరువు ఉన్న మత్స్యాలు వలలకు చిక్కాయి.
అంతే కాకుండా.. మత్స్యకారులకు దొరికిన ప్రతి చేప కూడా పది కిలోలకు పైగా బరువుంది. ముఖ్యంగా 30 కిలోల బరువున్న చేప అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంత పెద్ద మీనాలను చెరువుల్లో చూడటం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.