ప్రకాశం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీరాల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరింది. రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
PRAKASHAM-RAINS : భారీ వర్షాలు.. పొంగి పొర్లుతున్న జలాశయాలు - prakasham district weather
వాయుగుండం ప్రభావంతో.. ప్రకాశం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పొంగి పొర్లుతున్న వాగులు
ఇక, పంటచేలల్లోకి వరద చేరడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. యద్దనపూడి మండలంలోని పర్చూరు వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకొల్లు మండలం పూసపాడు అడ్డరోడ్డు వద్ద కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
ఇదీచదవండి.