ప్రకాశం జిల్లాలో పలుచోట్ల వర్షాలు ముంచెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒంగోలు పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన కాలువల్లో మురుగు నీరు పొంగి రహదారుల మీదకు వచ్చి ప్రవహిస్తోంది. కర్నూలు రోడ్డులో వర్షపు నీరు మోకాలు లోతులో ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షంతో పాటు చలిగాలులు కూడా వీస్తుండటంతో జనం గజగజ వణుకుతున్నారు. దీనికితోడు కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
ప్రకాశం జిల్లాలో పలుచోట్ల వర్షాలు..జలమయమైన రోడ్లు - ప్రకాశం జిల్లాలో వర్షం
ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలుచోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

ప్రకాశంలో పలు చోట్ల వర్షాలు..జలమయమైన రోడ్లు