ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలతో కంభం చెరువుకు జలకళ

ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన కంభం చెరువు జలకళ సంతరించుకుంది. జిల్లాతో పాటు, నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగుల ద్వారా భారీగా వరద నీరు చెరువులోకి చేరుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 18 అడుగులకు చేరుకుంది.

భారీ వర్షాలతో కంభం చెరువు జలకళ
భారీ వర్షాలతో కంభం చెరువు జలకళ

By

Published : Sep 27, 2020, 3:37 PM IST

ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.. ప్రసిద్ధి చెందిన కంభం చెరువులో నీటి మట్టం పెరిగింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వానలకు గండ్లకమ్మ, ఝంపలేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహించి భారీగా వరద చేరుకుంటోంది.

గత 5 సంవత్సరాలుగా నీరు లేక వట్టిపోయిన చెరువు... ఇప్పుడు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం చెరువులో నీరు 18 అడుగులకు చేరుకుంది. మరోవైపు.. స్థానికులు వరద రాజమ్మకు, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details