ప్రకాశం జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీగా కురుస్తున్నాయి. జిల్లాలోని యర్రగొండపాలెంలో తెల్లవారుజాము 2 గంటల నుంచి ఎడతెరపి లేకుండ కురిసిన వర్షానికి రహదారులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందలు పడుతున్నారు. చిన్నగంజాం మండలంలో కురిసిన వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందలు పడ్డారు. ఇక్కడ పడిన వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సాగు చేయటానికి ఈ వర్షాలు ఎంతో ఉపయోగపడతాయని రైతులు ఆనందపడుతున్నారు.
ప్రకాశంలో భారీ వర్షాలు - undefined
ప్రకాశం జిల్లా వాసులను ఇన్ని రోజులు ఊరించి ఉసూరుమనిపించిన వర్షాలు ఇప్పుడు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ప్రకాశంలో భారీ వర్షాలు
TAGGED:
heavy rain in prakasham