ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షం ఎంతగానో ఉపయోగపడింది. వర్షపు నీటిని ప్రజలు బిందెలు, బకెట్లతో పట్టుకొని నిల్వ చేసుకున్నారు. కాగా వడగండ్ల వాన కారణంగా కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కరుణించిన వరుణుడు... ప్రజలకు కాస్త ఉపశమనం - heavy rain
భానుడి ప్రతాపంతో గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. వరుణుడు కరుణించడంతో కాస్త ఉపశమనం పొందారు.
ప్రకాశం జిల్లాలో కరుణించిన వరుణుడు