ప్రకాశం జిల్లా చీరాల ఉదయం నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. వేటపాలెం, చినగంజాం, పర్చూరు, అద్దంకిలోనూ ఇదే పరిస్థితి. దుకాణాదారులు షాపులు తెరవటానికి ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఉదయం నుంచే వర్షం కురవటంతో పనులకు వెళ్లే కూలీలకు అంతరాయం కలిగింది. గుంతల్లో నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
చీరాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం - ప్రకాశం జిల్లాలో వర్షం
ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావటంతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
heavy rain in prakasam dst chirala