ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విత్తనాలు వేసుకోవడానికి ఇదే అనుకూలమైన సమయమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా తాగు, సాగునీటి సమస్యతో అల్లాడుతున్న గిద్దలూరు పట్టణ ప్రజలు.. వర్షం పడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో పలు చోట్ల వర్షాలు - ప్రకాశంలో వర్షాల వార్తలు
ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల వర్షం కుండపోతగా పడుతోంది. కొన్ని రోజులుగా సాగునీటి సమస్యతో అల్లాడుతోన్న తమకు ఈ వర్షం ఊరట ఇస్తోందని జిల్లా వాసులు ఆశాభావం ొవ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో పలు చోట్ల భారీగా కురిసిన వర్షాలు