ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ దెబ్బకు...పంటలకు తీవ్ర నష్టం - heavy rain in nellore district

తుపాను దెబ్బకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సైతం వరదకు అవస్థల పాలయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ప్రజాప్రతినిధులు.... బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు

By

Published : Nov 29, 2020, 9:59 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు

భారీ వర్షాలు, వరదలు నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేశాయి. వరద ఉద్ధృతికి పెద్దఎత్తున రోడ్లు సైతం కోతకు గురయ్యాయి. ఎడతెరపిలేని వర్షాలు, చలిగాలులతో పశువులు మృతి చెందాయి. సోమశిల ప్రాజెక్టు వరద పరిస్థితిని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పరిశీలించారు. నెల్లూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో.... అనిల్‌కుమార్, గౌతంరెడ్డి పర్యటించారు. స్థానికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ప్రకాశం జిల్లాలో...

జోరు వర్షాలు ప్రకాశం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. వెలిగండ్ల మండలం గన్నవరంలో పాలేటివాగు ఉద్ధృతితో... స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం పరిధిలో పంటలు నీటిపాలయ్యాయి. నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పరామర్శించారు. చీరాలలో నీటమునిగిన పంటలను ఎమ్మెల్సీ పోతుల సునీత పరిశీలించారు. బేస్తవారిపేట మండలంలో తుపాను ధాటికి దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిశీలించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కడప జిల్లాలో..

కడప జిల్లా రాజంపేటలో గేట్లు కిందికి దిగకపోవడంతో నీళ్లన్నీ వృథాగా పోయిన అన్నమయ్య ప్రాజెక్టును... ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి ఎంపీ మిథున్‌రెడ్డి పరిశీలించారు. 3 రోజులుగా గేట్లు దిగకపోవడంతో... నిపుణులను రప్పించి సరిచేశారు. ఎట్టకేలకు నీటి వృథాను అరికట్టారు. అనంతపురం జిల్లా కదిరి మండలంలో పర్యటించిన నివర్ మంత్రి శంకర నారాయణ... తుపానుతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రాయదుర్గం పరిధిలోని బొమ్మనహాశళ్ల, కణేకల్ మండలాల్లో... తుంగభద్ర జలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కణేకల్ సమీపంలోని చిక్కనేశ్వర వడియార్ చెరువుకు రంధ్రం ఏర్పడటంతో... రైతులు ఆందోళన చెందుతున్నారు. నంబులపూలకంట మండలంలో పర్యటించిన కదిరి తెదేపా నియోజకవర్గ తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్..... దెబ్బతిన్న పంటపొలాలు పరిశీలించారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కోటి దాటిన కరోనా పరీక్షలు....

ABOUT THE AUTHOR

...view details