చీరాలలో వర్షం...పలు ప్రాంతాలు జలమయం - rain news prakasham district
గత రెండు రోజులుగా ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చీరాల ప్రజలు ఉపశమనం పొందారు.

చీరాలలో వర్షం...పలు ప్రాంతాలు జలమయం
ప్రకాశం జిల్లా చీరాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఉపశనం పొందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చీరాల, వేటపాలెంలో రహాదారులన్ని చిత్తడిగా మారాయి. కొన్నిచోట్ల రహాదారులపై వర్షపు నీరు నిలిచింది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు.