ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో జోరుగా వర్షం-నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు - Heavy rain fall in praksham dist Submerged lowlands

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జోరుగా కురిసిన వానకు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వర్షపు నీరు, మురుగు నీరు కలిసి కాలనీలను ముంచెత్తాయి.

Heavy rain fall in praksham dist Submerged lowlands
ప్రకాశం జిల్లాలో జోరుగా వర్షం-నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

By

Published : Jul 13, 2020, 11:23 PM IST

ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చీరాల పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. ఇంకొల్లు లో గంటపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంకొల్లు ముస్లిం కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. డ్రైనేజి కాలువలు ఆక్రమణలకు గురికావటంతో మురుగునీటితో వర్షపునీరు కలిసిపోయి ఇళ్లను ముంచెత్తాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించి సమస్య పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details