జిల్లాలోని కనిగిరి, పామూరు మండలాలలో భారీ వర్షం కురిసింది. కనిగిరి పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. కనిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో నీళ్లు నిలిచాయి. వర్షపు నీరు, మురుగు నీరు కలిసి రోడ్డుపై ప్రవహించాయి. కనిగిరిలో చిరుజల్లులు పడటంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షం.. అన్నదాతల్లో ఆనందం - ప్రకాశం జిల్లాలో వాతావరణం వార్తలు
ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురిసింది. పట్టణాల్లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో భారీ వర్షం
జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు గంటపాటు వానపడింది. పలు గ్రామాల్లో వాగులు చెక్ డ్యాంలు పొంగి పొర్లాయి. మన్నెంవారిపల్లి, పెద్దయాచారం, నాయుడుపల్లి, నికరంపల్లి, గోగులదిన్నెలో రహదారిపై వర్షపు నీరు పారింది.
ఇదీ చూడండి:తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ వివరణ