ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్టూరులో టీకా కేంద్రం వద్ద తోపులాట

ప్రకాశం జిల్లా మార్టూరు జడ్పీహెచ్​ఎస్​లోని వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద టీకా కోసం వచ్చిన ప్రజలు గుంపులుగా చేరి నెట్టుకున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్​లో ఉన్నా.. టీకా అందక కొందరు నిరాశగా వెనుదిరిగారు.

వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద గుమిగూడిన జనాలు
Heavy Floating of Vaccination Center at ZPHS Martur

By

Published : May 25, 2021, 7:33 PM IST

అధికారుల ప్రణాళిక లోపంతో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా చేరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 45 ఏళ్లు దాటినవారు ఉదయం నుండే టీకా కోసం బారులు తీరారు. ఉదయం 11 గంటలకు వచ్చిన వైద్య సిబ్బంది.. 300 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో టీకా కేంద్రం వద్ద తోపులాట జరిగింది. ఉదయం నుంచి క్యూ​లో ఉన్నా టీకా అందకపోవడంతో పలువురు నిరాశగా వెనుదిరిగారు.

ఇదే పరిస్దితి కొనసాగితే టీకా మాట దేవుడెరుగు కరోనా బారిన పడతామని కొందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలా టీకా కేంద్రం వద్ద పోటీ పడి కరోనా తెచ్చుకునే కన్నా గ్రామ సచివాలయాల్లో టీకాలు వేస్తే బాగుంటుందని మార్టూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details