ప్రకాశం జిల్లాలో గతేడాది లక్షా 51వేల 775 మంది వాహనదారులకు 4 కోట్ల 62 లక్షల 10వేల 984 రూపాయలు ట్రాఫిక్ చలానాల రూపంలో విధించగా 82వేల 832 మంది మాత్రమే 2 కోట్ల 13 లక్షల 57వేల 254 రూపాయలు చెల్లించారు. లక్ష 51వేల 687 మంది ఇంకా 2 కోట్ల 48 లక్షల 53 వేల 739 చెల్లించాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఓ ప్రకటనలో తెలిపారు. జరిమానాలను రెండు రోజుల్లో చెల్లించకపోతే ప్రత్యేక కార్యక్రమం చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం నూతనంగా అమలులోకి తెచ్చిన చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెద్దమొత్తంలో జరిమానాలు విధిస్తారని తెలిపారు. రహదారి పైకి వచ్చే ప్రతి వాహన చోదకుడు తప్పనిసరిగా అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాదారులు శిరస్త్రాణం, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్టు తప్పక ధరించాలని పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో నిబంధనలకు విరుద్దంగా రహదారుల వెంట ఆక్రమణలు చేసిన వారందరూ తప్పనిసరిగా తొలగించుకోవాలని సూచించారు.
రూ.2.48 కోట్ల ట్రాఫిక్ చలానాలు - News of traffic regulations in Prakasam district
నూతన ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు నడుచుకోవాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకంగా వాహనాలను నడిపితే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకించిన వారు రెండు రోజుల్లో జరిమానాలు చెల్లించాలని కోరారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రూ.2.48 కోట్ల ట్రాఫిక్ చలానాలు
TAGGED:
ప్రకాశం జిల్లా తాజా వార్తలు