TDP Mahanadu: ఒంగోలులోని మహానాడు ప్రాంగణం శ్రేణులతో కిక్కిరిసిపోయింది. పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చంద్రబాబు, లోకేష్, పార్టీ సీనియర్లు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రతినిధుల నమోదు, సభ్యత్వ నమోదు, ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను అధినేత చంద్రబాబు సందర్శించారు. పార్టీ కార్యకర్తల మృతికి నేతలు సంతాపం తెలిపారు. రెండు నిమిషాల పాటు మహానాడు మౌనం పాటించింది. వేదిక ఎక్కిన చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనగావించారు. 'మా తెలుగు తల్లి' గీతాలాపనతో మహానాడు ప్రారంభమైంది.
TDP Mahanadu: కిక్కిరిసిన మహానాడు ప్రాంగణం - మహానాడు సభకు భారీగా జనం
TDP Mahanadu: మహానాడు ప్రాంగణం పసుపు రంగలతో హంగులద్దుకుంది. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు, లోకేష్, సీనియర్ నాయకులు సభకు చేరుకున్నారు. 'మా తెలుగు తల్లి' గీతాలాపనతో మహానాడు ప్రారంభమైంది.
మహానాడు