ప్రకాశం జిల్లా కనిగిరిలో అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని.. కనిగిరి నగర పంచాయతీలో రెండు ఆరోగ్య కేంద్రాలు మంజూరు అయ్యాయని నగర పంచాయతీ కమిషనర్ నారాయణ రావు చెప్పారు. అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం.. ఒక్కో సెంటర్‌కు రూ.80 లక్షల చొప్పున మొత్తం కోటి అరవై లక్షల రూపాయలు విడుదల చేసిందన్నారు. త్వరలోనే వీటిని పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు.
శరవేగంగా కనిగిరి అర్బన్ హెల్త్‌కేర్ సెంటర్ నిర్మాణ పనులు - prakasham news
కనిగిరి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కనిగిరి నగర పంచాయతీకి రెండు ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని నగర పంచాయతీ కమిషనర్ నారాయణ రావు చెప్పారు. నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
health care centres constructions in kanigiri