ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో అవినీతికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించామని చెప్పారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం:

మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన మదిరే రంగ సాయిరెడ్డి పొలం గట్టు విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. పోలీసులు అతని ఫిర్యాదును నమోదు చేసుకోలేదు. దీంతో అతను ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న హెడ్ కానిస్టేబుల్... ఫిర్యాదు చేసే వ్యక్తి నుంచి రూ.5000 డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు స్పందన కార్యక్రమం ద్వారా కంప్లైట్ చేయగా.. దాడులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయటం చట్ట వ్యతిరేకం.. కావున అతనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:అధికారుల అలసత్వం.. పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది..