నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని ఏరూరు సముద్ర తీరంలో సైకత శిల్పి సనత్ కుమార్ హ్యాట్సాఫ్ టూ ప్రెస్ అనే సైకత శిల్పాన్ని రూపొందించి మీడియాకు అంకితం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. ప్రాణాలకు తెగించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని ప్రశంసించారు. వారి సేవకు ప్రశంసాపూర్వకంగా ఈ శిల్పాన్ని రూపొందించినట్టు చెప్పారు.
మీడియాను ప్రశంసిస్తూ సైకత శిల్పం
కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న మీడియా సేవలను ప్రశంసిస్తూ.. నెల్లూరు జిల్లా ఏరూరు సముద్ర తీరంలో కళాకారుడు సనత్‌కుమార్ సైకత శిల్పాన్ని రూపొందించారు. హాట్సాఫ్ టూ ప్రెస్ అన్న నినాదాన్ని సైకత శిల్పంపై అందంగా తీర్చిదిద్దారు.
హ్యాట్సాఫ్ టూ ప్రెస్ : నెల్లూరు జిల్లాలో సైకత శిల్పం రూపకల్పన