ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై యువకుడి వేధింపులు
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై యువకుడి వేధింపులు - మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై యువకుడి వేధింపులు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని ఓ యువకుడు వేధింపులకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్.ఎస్ నగర్‌కు చెందిన అన్వర్ వేధింపులకు పాల్పడ్డాడు. తన సోదరి డీఎస్సీకి సన్నద్దమౌతోందని చెప్పి... ఉపాధ్యాయురాలితో మాటలు కలిపి... ఫోన్ నెంబర్ తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని చెప్పింది. పాఠశాలకు వెళ్తుండగా... వెంటపడుతున్నాడని వాపోయింది.
![ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై యువకుడి వేధింపులు ప్రభుత్వ ఉపాధ్యాయినిపై యువకుడి వేధింపులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5573160-173-5573160-1577974304022.jpg)
ప్రభుత్వ ఉపాధ్యాయినిపై యువకుడి వేధింపులు