హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. నేడు ఉదయం హనుమద్దీక్ష , భక్తులు అర్చకులు సిబ్బందితో ఆలయ ప్రదక్షిణ, గణపతి ,సుబ్రహ్మణ్యేశ్వర, దేవతలకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసన్న ఆంజనేయ స్వామికి అభిషేకం గావించారు. అనంతరం స్వామివారికి పలు రకాల పుష్పాలతో అలంకరణ చేశారు.
"సింగరాయకొండలో హనుమన్న ఉత్సవాలు ప్రారంభం" - prakasam
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
"సింగరాయకొండలో హనుమన్న ఉత్సవాలు ప్రారంభం"