సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, హ్యాడి క్రాప్ట్స్, రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత కార్మికుల నేత పోటీలు ముగిసాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురంలో ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హాజరై.... విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ముందుగా పోటీలో కార్మికులు నేసిన వస్త్రాలను పరిశీలించారు... 9 రకాల పోటీలకు 170 మంది నేతకార్మికులు పోటీపడగా రకానికి ముగ్గురు చొప్పున 27 మంది పోటీలో విజేతలుగా ప్రకటించారు.
చీరాలలో ముగిసిన చేనేత కార్మికుల నేత పోటీలు - చీరాలలో చేనేత కార్మికల నేత పోటీలు
నాలుగు రోజులుగా సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ,హ్యాడి క్రాప్ట్స్, రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత కార్మికుల నేత పోటీలు ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హాజరై.. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.
చీరాల లో ముగిసిన చేనేత కార్మికుల కు నేతపోటీలు
ఇలాంటి పోటీలు నిర్వహించటం వల్ల కార్మికుల్లో పోటీతత్వం అలవాటు పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం వృద్ధ చేనేత కార్మికులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ సభ్యురాలు గోరంట్ల సుధా కిరణ్, చేనేతశాఖ అధికారులు, చేనేత జనసమైఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ..వైకాపాలో చేరాలని హింసిస్తున్నారు.. ఎస్సైపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు