ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా చేనేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం వీవర్సు కాలనీలో జరిగింది. వీవర్సు కాలనీకి చెందిన దామర్ల శ్రీనివాసరావు (40) ఆరు నెలలుగా కరోనా లాక్ డౌన్ కారణంగా చేనేత పనులు లేకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావటంతో మానసికంగా కుంగిపోయి ఉరి వేసుకుని మగ్గం వద్దే ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.
మగ్గం వద్దే చేనేత కార్మికుడి బలవన్మరణం - suicide news in prakasam dst
ఆర్థిక ఇబ్బందులతో ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం వీవర్సు కాలనీలో చేనేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడడం, ఈ క్రమంలోనే ఆరోగ్య సమస్యలు పీడించటంతో ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు.

handloom worker committed suicide in prakasam dst