ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్సాహంగా చేనేత కార్మికుల నేత పోటీలు - Weaving competitions for handloom workers news

చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు.... వృత్తి నైపుణ్యాలను తరువాత తరాలకు అందించేందుకు ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురంలో నేత పోటీలు నిర్వహిస్తున్నారు. మంచి స్పందన లభిస్తోంది.

handloom weaving competitions
చేనేత కార్మికుల నేత పోటీలు

By

Published : Jan 17, 2021, 10:58 AM IST

హస్తినాపురంలో చేనేత కార్మికులకు నేత పోటీలు

చీరాల మండలం హస్తినాపురంలో చేనేత కార్మికులకు నేత పోటీలు నిర్వహిస్తున్నారు. సొసైటీ ఫర్ హ్యాండ్ లూమ్స్, హ్యాండీ క్రాప్ట్స్​, రాష్ట్ర చేనేత జనసమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చేనేత వస్త్ర ఉత్పత్తిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజైన్లు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు వస్త్రాలను నేస్తున్నారు.

"చేనేత పోటీలు నిర్వహించిన వారికి అభినందనలు. ఈ పోటీ చాలా ప్రత్యేకంగా ఉంది. 160 మంది ఇందులో పాల్గొన్నారు. చీరాలలో 62,000 మంది చేనేత కార్మికులు, 7-8 వేల మగ్గాలు ఉన్నాయి. అతి పెద్ద హ్యాండ్​లూమ్​ సెక్టార్​. ఇక్కడ ఉండి, క్రాఫ్ట్​ కౌన్సిల్​కు పని చేయటం ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే బలరాం కూడా చేనేత వారిని ప్రోత్సహిస్తూ వారికి సహయ సహకారాలు అందిస్తున్నారు" -గోరంట్ల సుధా కిరణ్, ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ సభ్యురాలు

ఉత్పత్తులు, డిజైన్లను బట్టి ఒక్కొక్కరికి గంట నుంచి రెండు గంటల సమయం నిర్వాహకులు కేటాయించారు. తక్కువ సమయంలో నాణ్యమైన డిజైన్, నేత విధానం బాగున్న వారిని విజేతలుగా ప్రకటిస్తామని చెప్పారు. రేపటి వరకు ఈ పోటీలు జరగనున్నాయి. అనంతరం విజేతలకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి బహుమతులు ప్రధానం చేయనున్నారు.

"ఇటువంటి కార్యక్రమాలు వస్త్ర ఉత్పత్తిలో సంవత్సరాలుగా ఉన్న పలు చేనేత రకాల గురించి తెలియజేసేందుకు ఉపయోగపడతాయి. ఈ ఉత్పత్తుల ద్వారా నైపుణ్యాలు వెలికితీయటమే కాక.. భవిష్యత్తు తరాలకు ఉపాధి కల్పించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఈ పోటీలు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నైపుణ్యాలు పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ పోటీ మార్గదర్శకం" -బీరక సురేంద్ర, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్

"ఈ పోటీలు చేనేత కళను బయటతీసే విధంగా ఉన్నాయి. విజేతలయ్యేందుకు ఉత్తేజంతో పనిచేస్తూ..వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచుకుంటున్నాం. మళ్లీ ఏడాది నిర్వహించే పోటీలో మరిన్ని నైపుణ్యాలు పెంచుకుని పాల్గొనాలనే పట్టుదల అందరిలోనూ పెరుగుతుంది. చేనేత పోటీలు ఈ ప్రాంతంలో మార్పు తీసుకువస్తాయని అనుకుంటున్నాం" -మాచర్ల గౌరీశంకర్, పోటీదారుడు.

ABOUT THE AUTHOR

...view details