ప్రకాశం జిల్లా దొనకొండ, సీఎస్ పురం మండలాల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ పోల భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా భూ సేకరణలో సాధించిన పురోగతిని అధికారులు కలెక్టరుకు వివరించారు. దొనకొండ మండలంలోని 2,576 ఎకరాలు, సీఎస్ పురం మండలంలో పెదగోగులపల్లి గ్రామంలో 3266.98 ఎకరాల భూమి కావాలని ఏపీజీఈసీఎల్ ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే ఏపీజీఈసీఎల్కు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని, పట్టా, అసైన్డ్ భూముల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.