గతంలో గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలోనూ కూరగాయలు, పండ్ల చెట్లు పెంచుకోవటం ఆనవాయితీగా వస్తుండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేక పెరటి తోటలు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇతర వృత్తులు చేసుకునే వారితోపాటు వ్యవసాయ కూలీల కుటుంబాలు... రైతు కుటుంబాలు కూడా కూరగాయలకు పూర్తిగా దుకాణాలపైనే ఆధారపడే దుస్థితి వచ్చింది. ఫలితంగా గ్రామీణుల్లో పౌష్టికాహార లోపం తలెత్తి ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానం పూడి గ్రామానికి చెందిన చిమ్మిడి అంబయ్య, చిన్నమ్మాయి దంపతులు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారుల సూచనలు పాటించారు. ఇంటి ఆవరణలోని పెరట్లో అరసెంటు స్థలంలో సూర్య మండలం విధానంలో 15 రకాల ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు. వాటితో వంటలు చేసుకుంటూ ఇంట్లోని పిల్లలు, పెద్దలు, వృద్ధులకు పౌష్టికాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.జిల్లా వ్యాప్తంగా 250 మంది రైతులు సూర్యమండలం విధానంలో పెరటి సాగు చేపట్టారన్నారు.
సూర్య మండలం విధానంతో... 15 రకాల ఆకుకూరలు, కూరగాయలు ! - Prakasam District Latest News
పల్లె ప్రజల్లో కూడా ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. రసాయన ఎరువులతో పండించే కూరగాయలు, ఆకు కూరలు ఆరోగ్యం హరిస్తున్నాయని తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు నూతన పద్దతులు అనుసరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో రైతు కుటుంబం సూర్యమండలం విధానంలో ఇంటి పరిసరాల్లోనే ఏడాదంతా ఒకటికి పది రకాల ఆకుకూరలు... కూరగాయలు... ఔషధ మొక్కలు పెంచుకుని ఆరోగ్యం కాపాడుకుంటున్నారు..
![సూర్య మండలం విధానంతో... 15 రకాల ఆకుకూరలు, కూరగాయలు ! అర సెంటు స్థలంలోనే.... 15 రకాల ఆకుకూరలు, కూరగాయలు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10270330-1022-10270330-1610965605964.jpg)
అర సెంటు స్థలంలోనే.... 15 రకాల ఆకుకూరలు, కూరగాయలు !
సూర్య మండలం విధానంతో... 15 రకాల ఆకుకూరలు, కూరగాయలు !
ఇవీ చదవండి