ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు చేపట్టిన గాంధీ సంకల్ప పాదయాత్ర... ప్రకాశం జిల్లా బల్లికురవ చేరింది. ముఖ్యఅతిథిగా భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు హారయ్యారు. బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో గాంధీజీ ఆశయాలను వివరిస్తూ... పాదయాత్ర చేపట్టారు. అందరూ గాంధీజీ మార్గంలో నడిచినప్పుడే గ్రామ స్వరాజ్యం కల సాకారమవుతుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
అందరూ గాంధీజీ మార్గంలో నడవాలి: జీవీఎల్
ప్రధాని మోదీ పిలుపుమేరకు చేపట్టిన గాంధీ సంకల్ప పాదయాత్రలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. గాంధీజీ ఆశయాలను వివరిస్తూ... పాదయాత్ర చేపట్టారు.
రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు