GVL Narasimha Rao's comments on YCP: బీసీల పట్ల వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలో బీసీల జనగణన చేపట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. వారు పోటీ చేయాల్సిన కొన్నిచోట్ల ముస్లింలకు కేటాయించిందని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ల పేరుతో కుర్చీలు టేబుళ్లు సైతం లేని పదవులను సృష్టించి గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. కొందరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా.. వారి పేర్లు కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవ చేశారు.
వైసీపీ చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల్లో బీసీల జనగణన చేయాలి: జీవీఎల్ - జీవీఎల్ నరసింహ ప్రెస్ మీట్
GVL Narasimha Rao's comments on YCP: బీసీల పట్ల వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలో బీసీల జనగణన చేపట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
బీసీల జనగణన చేయాలి