ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 17, 2021, 9:30 AM IST

ETV Bharat / state

Arrest: గుప్త నిధుల వేటగాడు అరెస్ట్

గుప్తనిధులు ఎక్కడెక్కడున్నయో తనకు తెలుసని, తవ్వితే సంపన్నులవుతామని చెప్పి పలువురిని ముఠాగా ఏర్పరుచుకుని నమ్మించి మోసం చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అసలు విషయం రాబట్టారు.

GUPTHA_NIDHULU_ARREST
గుప్తం నిధుల వేటగాడు అరెస్ట్

గుప్తనిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసంటూ జనాలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని ప్రకాశం జిల్లా అద్దంకిలో అదుపులోకి తీసుకున్నారు. గుప్తనిధుల తవ్వకాలు జరపడం కోసం కావలసిన సామగ్రిని తరలిస్తుండగా పట్టుకున్నారు. విజయవాడకు చెందిన సంజయ్​నాథ్ అనే వ్యక్తి.. గుప్త నిధుల కోసం తవ్వకాలు, పురాతన విగ్రహాల చోరీ వంటి నేరాలకు అలవాటుపడ్డాడు. అతనితో పాటు ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన షేక్ కరిముల్లా.. నేరాల్లో భాగం పంచుకుంటుంటాడు.

కొన్ని రోజుల క్రితం సంజయ్​నాథ్.. 2 పంచలోహ విగ్రహాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్.. షేక్ కరిముల్లాకు ఇచ్చి భద్రపరచాలని చెప్పాడు. వాటిని ద్విచక్రవాహనంపై అద్దంకి నుంచి వేరే చోటికి కరీముల్లా తరలిస్తుండగా బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా గుర్తించి పట్టుకున్నారు. గుప్తా నిధుల కోసం తవ్వకాలు చేస్తామని, సంజయ్​నాథ్ అనే వ్యక్తి ఈ పని నిర్వహిస్తుంటాడని కరీముల్లా తెలిపాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు విగ్రహాలను, ద్విచక్రవాహనాన్ని, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సంజయ్​నాథ్ కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details