ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీసీ బాలుర వసతి గృహంలో అనిశా అధికారుల తనిఖీలు - guntur district acb officers rides latest news

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో అనిశా అధికారులు తనిఖీలు చేశారు. 86 మంది విద్యార్థులకు తొమ్మిది మంది విద్యార్థులు వసతి గృహంలో ఉంటున్నట్లు గుర్తించారు. హాస్టల్ వార్డెన్ హరిప్రసాద్ అందుబాటులో లేని కారణంగా.. సిబ్బందిని విచారిస్తున్నారు.

guntur district acb officers rides at prakasham district
బీసీ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

By

Published : Dec 19, 2019, 10:50 PM IST

బీసీ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 86 మంది విద్యార్థులకు 9 మంది విద్యార్థులే వసతి గృహంలో ఉంటున్నట్లు గుర్తించారు. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్న విషయం తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. వసతి గృహంలో ఉన్న బెడ్లు వాడకుండా.. ఒక గదిలో పెట్టి తాళం వేసి ఉండటాన్ని దాడుల్లో గుర్తించారు. పైగా.. సోదాల సమయంలో హాస్టల్ వార్డెన్ హరిప్రసాద్ లేకపోవటంపై అనిశా అధికారులు సిబ్బందిని ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ హరిప్రసాద్ ఫోనులోనూ అందుబాటులో లేరని అనిశా ఎఎస్పీ సురేష్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details