2004లో గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టును 165 కోట్ల రూపాయలతో నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ జలాశయం కట్టడంతో అద్దంకి మండలంలోని ధేనువుకొండ, మణికేశ్వరం, తిమ్మారెడ్డిపాలెం, పాతకొటికలపూడి.. కొరిశపాడు మండలంలో తమ్మవరం, ఏర్రబాలెం, అనమనమూరు.. మద్దిపాడు మండలంలో ఘడియపూడి, అన్నంగి, బూరేపల్లి చినమల్లవరం, గార్లపాడును ముంపు గ్రామాలుగా పరిగణించి.. పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిల్లో పూర్తిగా మునిగిపోయే మల్లవరం, ఘడియపూడి, గార్లపాడు తమ్మవరం ప్రజలు గ్రామాలను ఖాళీచేశారు. పునరావాసం విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది మిగిలిన గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
పన్నెండేళ్ల క్రితమే సామాజిక సర్వే..
ముంపు గ్రామాల ప్రజలను తరలించడానికి పన్నెండేళ్ల క్రితం చేసిన సామాజిక సర్వేలో అర్హులుగా గుర్తించిన గ్రామస్థులకు పరిహారం, ప్యాకేజీ కోసం పేర్లు నమోదు చేశారు. ఈమేరకు పరిహారం, పునరావాసం కల్పించారు. ఇది కూడా సరిగా లేదని భూమి ఒకరిదైతే పరిహారం మరోకొకరికి వచ్చిందని వాపోతున్నారు.
అనర్హులు అర్హులయ్యారు..