ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2021, 3:33 PM IST

ETV Bharat / state

రాళ్ల భూమిలో జామ సాగు.. అవగాహనతో లాభల బాట

ప్రస్తుత సమాజంలో విద్యావంతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తే.. ఉద్యోగం చేసుకోక ఎందుకు కష్టాలు అంటూ ఉచిత సలహా ఇస్తారు. అలాంటిది హైదరాబాదులో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేస్తానన్న కుమారునికి.. తండ్రి బాసటగా నిలిచాడు. తండ్రి అనుభవ పాఠాలకు.. ఆధునిక ఆలోచనలు జోడిస్తూ మంచి లాభాలు పొందవచ్చని చెబుతున్నాడు ప్రకాశం జిల్లా సంతమాగులూరు కు చెందిన కొండారెడ్డి లక్ష్మిరెడ్డి.

guava farming
జామ సాగు

ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు కొండారెడ్డి లక్ష్మిరెడ్డి రాళ్ల భూమిలో రతనాల పంట పండిస్తున్నారు. హైదరాబాదులో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేసేందుకు పల్లె సీమకు వచ్చారు. రాళ్లు రప్పలు పిచ్చి చెట్లతో నిండిన బీడు భూముల్ని చదును చేసి సాగులోకి తెచ్చారు. తనకు ఉన్నటువంటి భూమి ఏ పంటకు సరిపోతుందో తెలుసుకుని దానికి తగిన విధంగా చర్యలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదిగాడు కొండా రెడ్డి లక్ష్మి రెడ్డి, తండ్రి అనుభవం పాఠాలను మేధస్సుకు జోడించి రాళ్ల భూమిని పంట భూమిగా చేశాడు.

తనకు ఉన్న 10 ఎకరాల భూమిని క్రేన్ సహాయంతో చదును చేయించి నీటి వసతి కోసం బోర్లు వేయించాడు. ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకునేందుకు డ్రిప్​ ఏర్పాటు చేసుకున్నాడు. తన భూమిలో జామ పంట సరైనదని తెలుసుకొని 'యాపిల్ జామ' అనే రకాన్ని ఎకరాకు 12 వందలు చొప్పున నాటించాడు.

"మొక్కలు ఎదిగి కాయ పక్వానికి రావడానికి 15 నెలల సమయం పడుతుంది. ఆ తరువాత ప్రతి సంవత్సరం రెండు కోతలుగా కాయలు వస్తాయి. కేజీకి ధర సుమారు 20 రూపాయలు ఉంటే రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక్కో మొక్క కొనుగోలు కూలి రూ.30 అవుతుంది. దీనికి తోడు ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఖర్చులు అన్నీ కలిపి 50 వేల రూపాయల వరకు అవుతుంది" -రైతు కొండా రెడ్డి లక్ష్మి రెడ్డి

ఒక ఎకరం సాగు చేయాలి అంటే ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని లక్ష్మి రెడ్డి అన్నారు. మొదటి సంవత్సరం మొక్కలు కొనుగోలు, నాటేందుకు అయ్యే ఖర్చులు అదనంగా ఉంటాయని చెప్పారు. తరువాతి మూడు సంవత్సరాలు ఆదాయ వనరులుగా ఈ జామ మొక్కలు ఉంటాయని తెలిపారు.

ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జామ సాగు చేస్తున్న కొండారెడ్డి లక్ష్మిరెడ్డి.
జామ మొక్కలు నాలుగు సంవత్సరాల పాటు ఉంటాయని చెప్పారు.తరువాత కూడా ఫలసాయం పొందేందుకు వీలుగా జామ మొక్కలకు మధ్య సీతాఫలం మొక్కలను నాటించారు. నేల స్వభావం అనుగుణంగా చేయాల్సిన పనులు, సకాలంలో పాటించాల్సిన చర్యలు, పంట మార్పిడి విధానం, మార్కెటింగ్ పై అవగాహనతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని కొండా రెడ్డి లక్ష్మి రెడ్డి అంటున్నారు.ఇదీ చదవండి:విద్యార్థుల కోసం మాష్టారు యూట్యూబ్ ఛానల్​

ABOUT THE AUTHOR

...view details