ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.85 కోట్ల జీఎస్టీ ఎగవేత ఘటనలో నిందితుల పట్టివేత - నకిలీ గ్రానైట్ వ్యాపారం

నకిలీ గ్రానైట్ వ్యాపారం పేరుతో ప్రభుత్వాన్ని మోసగించిన నలుగురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి,వారి నుంచి ద్రవపత్రాలను తీసుుకుని ఈ ఘటనకు పాల్పడ్డారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు.

రూ.85 కోట్లు పన్నును నిందితులు ఎగ్గొట్టారు

By

Published : Sep 17, 2019, 6:51 PM IST

రూ.85 కోట్లు పన్నును నిందితులు ఎగ్గొట్టారు

ప్రకాశం జిల్లాలో జీఎస్టీ ఎగవేతదారుల గుట్టును పోలీసులు రట్టు చేశారు.గ్రానైట్ వ్యాపారం పేరుతో నకిలీ పత్రాలను సృష్టించిన వ్యాపారులు సుబ్బారావు,రమేశ్,గౌరీనాయుడు,మహేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ నిందితులు ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి,వారి వద్ద నుంచి ధ్రువపత్రాలను సేకరించి..ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. 278నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి,ఆ కంపెనీలకు సంబంధించి18,239బిల్లులను తయారు చేశారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.ఇందుకోసం మార్టూరు ప్రాంతంలో నకిలీ డోరు నంబర్లు తయారుచేశారని వెల్లడించారు.దీంతో మొత్తం రూ.85కోట్లు పన్నును నిందితులు ఎగ్గొట్టారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details