ప్రకాశం జిల్లాలో అత్యధికంగా సుబాబులు, జామాయిలు తోటలే రైతుల ఆదాయ మార్గాలు.. గత కొన్నేళ్ళుగా ఈ కర్రకొనే నాధుడే లేకపోవటం వల్ల పొలాల్లోనే చెట్లు ముదురిపోయి, పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ర సాగుతో ఇబ్బందులు ఉన్నాయి గాబట్టి తక్కువ పెట్టుబడి, అధికాదాయం, మార్కటింగ్ సౌకర్యం సులభంగా ఉన్న ప్రత్యమ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది...
ప్రకాశం జిల్లాలో పెద్ద సంఖ్యలో శనగ పంటవైపు దృష్టి పెట్టారు... ఏడాదికేడాది శనగ పండించే రైతులు పెరుగుతున్నారు... స్వల్పకాల వ్యవధి, తక్కువ వర్షపాతంతో సాగయ్యే శనగ వేస్తే, చేతికొచ్చిన పంటను కొనే నాధుడే కరవయ్యారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అంతంతమాత్రంగానే కొనుగోళ్ళు నిర్వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.