స్వచ్ఛతకు మారుపేరు... ముళ్లపాడు ప్రభుత్వ పాఠశాల - greenary school
ప్రకాశం జిల్లా ముళ్లపాడులోని గంజి భద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల స్వచ్ఛ భారత్కు మారుపేరుగా నిలుస్తోంది. అందమైన మెుక్కలతో పచ్చదనం పరుచుకున్న తోటలా పాఠశాల రూపుదిద్దుకుంది.
![స్వచ్ఛతకు మారుపేరు... ముళ్లపాడు ప్రభుత్వ పాఠశాల greenary school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5801236-872-5801236-1579694154613.jpg)
ప్రభుత్వ పాఠశాలలు అనగానే మనకు పాడుబడిన భవనాలు, రంగులు లేక కళావిహీనంగా ఉన్న తరగతి గదులు గుర్తుకువస్తాయి. పచ్చదనం లేకుండా అపరిశుభ్రతతో ఉన్న ప్రాంగణాలు దర్శనమిస్తాయి.కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్లపాడు గ్రామంలోని గంజి భద్రయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వచ్ఛ భారత్కు మారుపేరుగా నిలుస్తోంది. ఈ పాఠశాల ప్రాంగణంలో అందమైన భవనాలు రంగులతో కళకళలాడుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు అందమైన మొక్కలను పెంచడం వల్ల పాఠశాలకు మరింత కళ వచ్చింది. దాతలుఎల్లవేళలా సహాయం చేస్తూ అభివృద్ధికి పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు.