చీమకుర్తి గ్రానైట్‌కు విదేశీ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు క్వారీ కంపెనీలు బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌ను వెలికి తీస్తున్నాయి. ఏపీ మైనింగ్ కార్పొరేషన్ భూముల్లో కూడా ఈ క్వారీయింగ్ నిర్వహిస్తున్నారు. చీమకుర్తి, మర్రిచెట్ల పాలెం గ్రామాల మధ్య గెలాక్సీ గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. కర్నూలు-ఒంగోలు ప్రధాన రహదారి ఈ క్వారీల మధ్య నుంచే ఉంది. ఈ రహదారి దిగువన విలువైన గ్రానైట్ ఉందని, దీన్ని కూడా వెలికితీస్తే మంచి ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఒంగోలు నుంచి మొదలయ్యే ఈ రాష్ట్ర రహదారి వెంట.... 24వ కిలోమీటర్ నుంచి 28వ కిలోమీటర్ వరకు.... అంటే 4 కిలోమీటర్ల మేర గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీన్ని వెలికితీస్తే మంచి ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా దీనిపై కన్నేశాయి. అనుమతిస్తే ఏపీఎండీసీ ద్వారా లీజుకు తీసుకొని క్వారీయింగ్ చేసుకోవచ్చే ఆలోచనతో పలువురు క్వారీ యజమానులు ఉన్నారు. ఈ రహదారిపై ఏ మేరకు గ్రానైట్ ఉందనే దానిపై 2015లోనే ప్రభుత్వం సర్వే నిర్వహించింది.
అప్పట్లో ఈ 4 కిలోమీటర్లలో 17 బోర్లు వేసి రాయి నాణ్యత పరిశీలించారు. ప్రస్తుత దారిలో 20 మీటర్ల వెడల్పులో 60 కిలోమీటర్ల లోతుకు తవ్వితే 1.2 లక్షల క్యూబిక్ మీటర్లు......, 80 మీటర్ల లోతుకు తవ్వితే 1.7 క్యూబిక్ మీటర్ల గెలాక్సీ లభ్యం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్యూబిక్ మీటర్ ధర 4వేల500 రూపాయలు ఉంది. దీని ప్రకారం 80మీటర్ల లోతులో తవ్వితే దాదాపు 76.5 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ లభిస్తుందని ప్రభుత్వ అంచనా. బఫర్ జోన్‌తో కలిపి లెక్కిస్తే ఇది 5 రెట్లు అధికంగా లభిస్తుంది.
చీమకుర్తికి గ్రానైట్ నిక్షేపాలపై ప్రభుత్వం దృష్టి విలువైన గెలాక్సీ గ్రానైట్‌ను వెలికితీయాలంటే ప్రస్తుత రహదారిని మూసివేసి, కొత్త దారి నిర్మించాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నాలుగు వరుసల రహదారి నిర్మించాల్సి ఉంటుంది. అందులో భాగంగా చీమకుర్తి బైపాస్ నుంచి ఆర్ఎల్ పురం డొంక వరకూ కొత్త దారి నిర్మించాలన్న ప్రతిపాదన.... రహదారులు-భవనాల శాఖ తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన ఖరారైతే ప్రస్తుత ఒంగోలు-కర్నూలు రోడ్డుపై ఆ 4 కిలోమీటర్ల దూరాన్ని మూసివేసి క్వారీల కోసం వినియోగిస్తారు.
ఇదీచదవండి.