చీమకుర్తి గనులపై ప్రభుత్వం దృష్టి! ఒంగోలు జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్‌కు ఉన్న విలువ ఇంతా అంతా కాదు... విదేశీ మార్కెట్‌లో ఈ గ్రానైట్‌కు మంచి గిరాకీ ఉంది.. ఇప్పటికే ఈ చీమకుర్తి ప్రాంతంలో పలు క్వారీ కంపెనీలు బ్లాక్ గెలక్సీ గ్రానైట్ వెలికి తీస్తున్నాయి. ఏపీ మైనింగ్ కార్పొరేషన్ భూముల్లో కూడా ఈ క్వారీయింగ్ నిర్వహిస్తున్నారు. చీమకుర్తి , మర్రిచెట్ల పాలెం గ్రామాల మధ్య గెలక్సీ గ్రానైట్ క్వారీలు ఉన్నాయి... ఈ క్వారీల మధ్య కర్నూలు - ఒంగోలు ప్రధాన రాష్ట్రీయ రహదారి ఉంది. ఈ రహదారి దిగువున విలువైన గ్రానైట్ ఉందని, దీన్ని కూడా వెలికి తీస్తే మంచి ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.
కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా దీనిపై కన్నేసాయి. క్వారీయింగ్‌కు అనుమతిస్తే ఏపి ఎండీసీ ద్వారా లీజుకు తీసుకొని క్వారీయింగ్ చేసుకోవచ్చే ఆలోచనతో పలువురు క్వారీ యజమానులు ఉన్నారు. ఈ రహదారి లో 24 కి.మీ. నుంచి 28 కి.మీ వరకూ దిగువన గ్రానైట్ నిక్షేపాలు ఉండగా... రహదారికి ఇరువైపులా ఇప్పటికే క్వారీయింగ్ జరుగుతోంది. అటు ఇటు ఉన్న క్వారీలు నాణ్యతతోనే రహదారికి దిగువున ఉన్న గని కూడా ఉంటుంది.
2015 సంవత్సరంలో ఈ రహదారిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ఏ మేరకు గ్రానైట్ ఉంటుందనే అంచనా కోసం సర్వే నిర్వహించారు.. 24 కి.మీ నుంచి 28 కి.మీ వరకూ ఉన్న రహదారిలో అప్పట్లో 17 బోర్లు వేసి రాయి నాణ్యత పరీక్షించారు. ప్రస్తుతం ఉన్న రహదారి వెడల్పు 20 మీ. లలో 60 మీ. లోతుకు తవ్వితే ఎంత రాయి లభ్యమవుతుందనే అంచనాలు వేయగా దాదాపు 1.20లక్షల క్యూబిక్ మీటర్లు, 80 మీటర్లు లోతుకు తవ్వితే 1.70 లక్షల క్యూబిక్ మీటర్లు గెలెక్సీ లభ్యం అవుతుందని తెలిసింది.
రహదారికి ఇరువైపులా బఫర్ జోన్ క్రింత కొంత స్థలం ఉంది. బఫర్ జోన్‌తో కలిపి రోడ్డు దాదాపు 100 మీటర్లు వెడల్పు ఉంటుందని అంచనా.. 100 మీ. లెక్కన లెక్కిస్తే ఇప్పుడనుకుంటున్న ఉత్పత్తి కి ఐదు రెట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం క్యూబిక్ మీటర్‌కు తక్కువలో తక్కువ లెక్కిచినా 4,500 రూపాయలు చొప్పున లభిస్తుంది. అంటే నాలుగు కిలో మీటర్లు, 20మీటర్ల వెడల్పు, 80మీ. లోతులో తవ్వితే దాదాపు 76.5కోట్ల విలువైన గ్రానైట్ రాయి లభిస్తుంది. బఫర్ జోన్‌తో కలిపి లెక్కిస్తే ఐదు రెట్లు అధికంగా లభిస్తుంది. ఇంతటి విలువైన గ్రానైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం దృష్టి సారించింది.
రహదారి నిర్మాణంపై ఆర్‌ఆండ్‌బీ ప్రతిపాదనలు..
విలువైన గెలక్సీ గ్రానైట్ తో సొమ్ముచేసుకువాలంటే ప్రస్తుతం ఉన్న రహదారిని మూసివేసి, కొత్త దారి నిర్మాణం చేపట్టాలి. భవిషత్తు అవసరాలు దృష్ట్యా నాలుగు వరుసల రహదారి నిర్మించాల్సి ఉంటుంది. కొత్త రహదారి ఎక్కడ నుంచి, ఎలా నిర్మించాలనే విషయంపై రహదారులు, భవనాలు శాఖ పలు ప్రతిపాదనులు తీసుకువచ్చింది.. చీమకుర్తి బైపాస్ నుంచి ఆర్ ఎల్ పురం డొంక వరకూ కొత్త దారి నిర్మించాలని ప్రతిపాదన తొలిత తీసుకువచ్చారు.. మధ్యలో కొన్ని గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి... భూసేకరణలో భాగంగా వీటిని తొలగించాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున పరిహారం చెల్లించవలసి వస్తుంది.. అందువల్ల ఈ ప్రతిపాదన కుకుండా చీమకుర్తి బైపాస్ నుంచి కెవి పాలెం. ఆర్ ఎల్ పురం, మీదుగా పులికొండ, మైలవరం, బూదవాడల మీదుగా మర్రిచెట్ల పాలెం వరకూ 10 కి.మీ. రహదారినిర్మాణం కోసం కొత్తప్రతిపాదనలు తీసుకువచ్చారు. ఇప్పటికే పులికొండ నుంచి మర్రిచెట్లపాలెం వరకూ కొంత తారు రోడ్డు, చీమకూర్తి ఆర్ఎల్‌పురం వరకూ కొంత మట్టి రోడ్డు ఉంది. రహదారి అవసరాన్ని బట్టి రహదారికి ఇరువైపులా కొంత భూమి సేకరిస్తే సరిపోతుంది. ఇందు కోసం ఇటీవల కొందరు ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులు క్షేత్ర పరిశీలనకూడా చేపట్టారు. ఈ రహదారి ప్రతిపాదన ఖరరాయితే ప్రస్తుత కర్నూలు-ఒంగోలు లో 24కిమీ. నుంచి28 కిమీ వరకూ రహదారిని మూసివేసి క్వారీలకోసం వినియోగిస్తారు.
ఇదీ చదవండి