ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: బాలవీరాంజనేయ స్వామి - Bala Veeranjaneya Swamy comments on YCP

ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని.. కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Bala Veeranjaneya Swamy
Bala Veeranjaneya Swamy

By

Published : Jun 6, 2021, 9:38 PM IST

కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంతమంది వైరస్ బారినపడ్డారని వ్యాఖ్యానించారు.

కరోనా ట్రీట్మెంట్ పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారీతిన దోచుకుంటుంటే... ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని... వైద్యారోగ్య శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... కరోనా కట్టడికి విపక్ష నేతల సూచనలు ఎందుకు తీసుకోలేదు?: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details