కనుమ పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో గోపూజ కార్యక్రమం జరిగింది. శ్రీ నాంచారమ్మ, శ్రీమాధవ ఆంజనేయ స్వామి, శ్రీ రంగనాయక స్వామి దేవస్థానాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంగళగిరి డీఎస్పీ బీరం నాగేశ్వరావు దంపతులు పాల్గొన్నారు. హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు గోనుగుంట సుబ్బారావు, మన్నం త్రిమూర్తులు హాజరయ్యారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
అద్దంకి పట్టణంలో గోపూజ కార్యక్రమం - అద్దంకి వార్తలు
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ కార్యక్రమం జరిగింది. ప్రత్యేక పూజల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

గోపూజ కార్యక్రమం