ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడ్స్ రైలు ప్రమాదంలో భారీ నష్టం - గూడ్స్ రైలు ప్రమాదంలో భారీ నష్టం

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్‌ రైలు నాయుడుపాలెం-బాపూజీ నగర్‌ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న డీజిల్‌ బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో రైల్వే శాఖకు దాదాపు కోటిరూపాయల నష్టం జరిగిందని అంచనా.

goods train accident
goods train accident

By

Published : Jun 25, 2020, 12:54 PM IST

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో భారీ నష్టం జరిగింది. మూడో రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం ఉన్న లైన్‌కు కలుపుకొని మట్టి లెవలింగ్‌ పనులు చేయడం వల్ల, మట్టకట్ట కుంగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు.

చెన్నై వైపు వెళుతున్న గూడ్స్ రైలులో ముడి చమురు రవాణా చేస్తున్నారు. ట్రాక్‌ చెడిపోవడం వల్ల చివరి ఏడు బోగీలు లింక్‌ ఊడి, పట్టాలు తప్పాయి. మూసినది మీద ఉన్న వంతనపై ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో మూడు బోగీలు మూసినదిలో పడిపోగా.. మిగిలినవి పట్టాలు మీద ఉన్నాయి. కింద పడిన బోగీలతో పాటు, పట్టాల మీద ఉన్న ఒక బోగి అగ్నికి ఆహుతయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి నాలుగు యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సుమారు నాలుగువేల కాంక్రీట్‌ స్లీపర్లు తుక్కుతుక్కయ్యాయి. రైల్వే విద్యుత్ లైన్‌, స్థంభాలు నేలకొరిగాయి. పట్టాలు ధ్వంసం అయ్యాయి. రైల్వే శాఖకు దాదాపు కోటి రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

బోగీలు, అందులో ఉన్న ముడి చమురు లక్షల్లో ఉంటుంది. రైల్వే లైన్‌ పునరుద్దరణ పనులు శరవేగంగా జరుతున్నాయి. రైలు పట్టాలు, కాంక్రీట్‌ స్లీపర్లను ప్రత్యేక ట్రైన్‌లో తీసుకొచ్చి మరమ్మతులు చేపట్టారు. ఇరువైపులా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి పాసింజర్ రైళ్లు తిరగని ఫలితంగా రద్దీ లేదు. గూడ్స్‌ రైళ్లను సమీప స్టేషన్లలో నిలిపివేశారు.

ఇదీ చదవండి:అర్ధరాత్రి ఘోర ప్రమాదం: రైలు నుంచి కిందపడిన డీజిల్‌ ట్యాంకర్లు

ABOUT THE AUTHOR

...view details