ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబోధన - కాశం జిల్లా పేర్నమిట్ట ప్రభుత్వ పాఠశాల

పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మలిసంధ్యలో ఆప్యాయతలకు దూరమైన వారికి సహాయం చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ విలువలు, మానవ సంబంధాల ఆవశ్యకతను బోధిస్తూ..సేవాతత్పరతను అలవరుస్తున్నారు..

good-school-good-study
good-school-good-study

By

Published : Dec 20, 2019, 9:09 AM IST

విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబోధన

ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మాటలకు సరైన అర్థాన్నిస్తున్నారు ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.కేవలం పుస్తకాలకే విద్యార్థులు పరిమితం కాకుండా...వారికి నైతిక విలువలు,మానవ సంబంధాలపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.పాఠశాలలో జూనియర్ రెడ్ క్రాస్ అనే సంస్థను నెలకొల్పిన ఉపాధ్యాయులు …వాటి ద్వారా పిల్లల్లో సేవాభావాన్ని అలవరుస్తున్నారు.

ఒక్కో విద్యార్థి రోజుకో రూపాయి చొప్పున...ఓ నిధిని పొగుచేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించారు.దీనికి కొంత జోడించి....అంతా కలిసి ఓ వృద్ధాశ్రమానికి నెలకు సరిపడా సరకులు అందించారు.అక్కడి వారితో మమేకమై...వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు.ఆప్యాయతకు దూరమై బతుకు భారంగా వెళ్లదీస్తున్న వృద్ధులు …పిల్లలను సొంత మనవళ్లు,మనవరాళ్లలా భావించి ముద్దాడారు.పెద్దమనసుతో సాయం చేసిన విద్యార్థులు,ఉపాధ్యాయులను ఆశీర్వదించారు.

ఆశ్రమంలో వృద్ధుల పరిస్థితి చూసి చలించిన చిన్నారులు....ఎట్టి పరిస్థితుల్లో తమ కుటుంబీకులకు అలాంటి పరిస్థితులు రానివ్వమని అన్నారు.వృద్ధాశ్రమాలు లేని సమాజం కోసం పనిచేస్తామని చెప్పారు.

సమాజం,కుటుంబ విలువల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. నైతిక విలువలతో కూడిన విద్యను తమ పిల్లలకు బోధిస్తూ ...ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల కృషిని తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.

ఇవీ చదవండి:

పక్షులంటే రామలక్ష్మికి ప్రాణం... పొద్దుగాల్నే లేచి...

ABOUT THE AUTHOR

...view details