ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి చెందిన షేక్ నాగూర్ భాషా అలియాస్ నాగూర్ తల్లిదండ్రులతో కలిసి పిడుగురాళ్లలో ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను దొంగతనాలు చేస్తున్నాడు. ఏడాదిపాటు జైలు జీవితం గడిపినా అతనిలో మార్పు రాలేదు. బయటికి వచ్చాక మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు. ద్విచక్రవాహనంపై వచ్చి మహిళల మెడల్లోని గొలుసులు లాక్కెళుతున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో మార్టూరు మండలం కొనంకిలో ఓ మహిళను బెదిరించి మూడు సవర్ల బంగారు గొలుసు, ఆరు వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లాడు. కశ్యాపురానికి చెందిన మరో మహిళ గొలుసును కూడా అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మార్టూరులోని కొణిదెన రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1.35 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఇంకొల్లు సీఐ సుబ్బారావు తెలిపారు.
చైన్ స్నాచింగ్ కేసుల్లో పాత నేరస్థుడి అరెస్టు - ప్రకాశం జిల్లా వార్తలు
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న పాత నేరస్థుడిని ప్రకాశం జిల్లా రేణింగవరం పోలీసులు అరెస్టు చేశారు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్న నాగూర్భాషాను మార్టూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గొలుసు దొంగ అరెస్జు