తెలంగాణలోని సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలో ఓ నర్సింగ్ హోం వద్ద పార్కు చేసిన కారులో 40 బంగారు బిస్కెట్లు, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కోల్‌కతా నుంచి మైసూర్ మీదుగా హైదరాబాద్‌కు బంగారాన్ని తరలించినట్లు ఒప్పుకున్నారు. పట్టుబడిన నిందితులు ముగ్గురూ హైదరాబాద్‌వాసులే.
పార్కింగ్ చేసిన కారులో చోరీ.. 4 కిలోల బంగారం అపహరణ - పార్కింగ్ చేసిన కారులో 4 కిలోల బంగారం..
పార్కింగ్ చేసిన కారులో 4 కిలోల బంగారు బిస్కెట్లు, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో జరిగింది.
![పార్కింగ్ చేసిన కారులో చోరీ.. 4 కిలోల బంగారం అపహరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5160292-445-5160292-1574572668485.jpg)
పార్కింగ్ చేసిన కారులో 4 కిలోల బంగారం, నగదు
పార్కింగ్ చేసిన కారులో చోరీ.. 4 కిలోల బంగారం అపహరణ
బంగారాన్ని విదేశాల నుంచి తీసుకొని ఎవరెవరికి విక్రయిస్తున్నారనే దానికి సంబంధించి డీఆర్ఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, నగదుకు ఎలాంటి ధ్రువపత్రాలు లేవని.. వారిని విచారిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. బంగారం విలువ కోటి 95 లక్షల రూపాయల వరకు ఉంటుందని.. ఈ పుత్తడి ఎవరికి సంబంధించినదనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.