బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ వేయాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం విధించడాన్ని నిరసిస్తూ.. ఆభరణాల వ్యాపారులు సమ్మె చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల వ్యాపారాలు నిర్వహించలేమని.. ఇప్పుడున్న పరిస్థితిల్లో హాల్ మార్క్ వేయటం అసాధ్యమని వారు తేల్చి చెబుతున్నారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23న దేశ వ్యాప్తంగా సమ్మె పాటిస్తున్నామని స్వర్ణ, వెండి, డైమండ్ వర్తకుల సంఘం ప్రతినిధులు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉన్న 700 జిల్లాల్లో.. కేవలం 250 జిల్లాల్లో మాత్రమే హాల్‌మార్క్ వేసే పరిశ్రమలు ఉన్నాయని.. వ్యాపారుల వద్ద ఇప్పుడున్న ఆభరాణాలన్నిటికీ మార్క్ వేయాలంటే ఏడాదైనా చాలదని చెప్పారు. రెండు లక్షలకు పైగా విలువైన ఆభరణాలు కొనేందుకు పాన్ కార్డు, ఆధార కార్డు ఇవ్వాలని ప్రభుత్వం అంటోందని.. కానీ దేశంలో 90 శాతం మందికి పాన్ కార్డు లేదని వారు అన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆదారపడి నివసించేవారు బంగారం కొనుక్కోవాలంటే ఈ నిబంధనలతో సాధ్యం కాదని చెప్పారు.